ఐదు రోజుల్లో పెండ్లి..  యువకుడు సూసైడ్

ఐదు రోజుల్లో పెండ్లి..  యువకుడు సూసైడ్

పెయిన్ కిల్లర్ టాబ్లెట్లు వేసుకొని, కత్తితో గొంతు కోసుకున్నడు
గచ్చిబౌలిలోని కొండాపూర్​లో ఘటన

గచ్చిబౌలి, వెలుగు: మరో ఐదు రోజుల్లో పెండ్లి ఉండగా, యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఇన్​స్పెక్టర్​బాలరాజు వివరాల ప్రకారం.. కొండాపూర్​మై హోమ్ మంగళ ఏ బ్లాక్​లోని ఫ్లాట్​నంబర్​ 301లో నివసించే ఎం. వెంకట కృష్ణ శ్రీసాయి(30) స్థానికంగా ఓ యానిమేషన్ కంపెనీ నిర్వహిస్తున్నాడు. ఇతనికి గత ఫిబ్రవరి 22న విశాఖలో  ఓ యువతితో నిశ్చితార్థం జరగగా, ఈ నెల 12న వివాహం నిశ్చయమైంది. కుటుంబ సభ్యులందరూ పెళ్లి పనుల్లో నిమగ్నమై ఉండగా, మంగళవారం తన రూమ్​మేట్ బయటకు వెళ్లిన సమయంలో వెంకట కృష్ణ దారుణానికి ఒడిగట్టాడు. పెయిన్ కిల్లర్ టాబ్లెట్లు వేసుకొని, కత్తితో గొంతు కోసుకున్నాడు.

ఆత్మహత్యకు ముందు తన సోదరుడు పవన్ కల్యాణ్, కాబోయే భార్య, మరో బంధువుకు ‘నేను సూసైడ్ చేసుకుంటున్నాను’ అని వెంకట కృష్ణ మెయిల్ పంపాడు. మెయిల్ చూసి కంగారుగా ఫ్లాట్​కు చేరుకున్న సోదరుడు, తలుపులు బద్దలుకొట్టి చూడగా వెంకట కృష్ణ రక్తపు మడుగులో పడి ఉన్నాడు. ఆర్థిక ఇబ్బందుల కారణంగానే అతను ఈ నిర్ణయం తీసుకుని ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. తన తమ్ముడి మృతిపై అనుమానాలు ఉన్నాయని  సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ ఘటనపై గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.